Asianet News TeluguAsianet News Telugu

నిద్రమాత్రలు వేసి రఫికా కూతురిపైనా సంజయ్ అత్యాచారం?

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 9 మందిని సామూహికంగా హత్య చేసిన సంజయ్ కుమార్ మరిన్ని దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రఫిక కూతురిపై కూడా అఘాయిత్యం చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Gorrekunta murders: Sanjay kumar molests Rafika's daughter
Author
Warangal, First Published May 29, 2020, 8:30 AM IST

వరంగల్: తన ప్రేయసి రఫికా హత్యను కప్పిపుచ్చుకోవడానికి 9 మందిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ మరిన్ని దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై మరిన్ని కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

15 ఏళ్ల వయస్సు గల రఫికా కూతురిపై కూడా సంజయ్ కుమార్ అత్యాచారం చేసినట్లు పోలీసులు అధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిద్రమాతర్లు ఇచ్చి మత్తులోకి జారిన తర్వాత ఆమెపై సంజయ్ అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అతనిపై పోక్సో చట్టం ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

రైలులో నిద్రమాత్రల పోడి కలిపిన పానీయం ఇచ్చి ఆ తర్వాత గొంతు నులిమి రఫికను హత్య చేసి ఆ తర్వాత ఆమెను రైలు నుంచి కిందపడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు వద్ద జరిగింది. ఈ హత్యను కప్పిపుచ్చుకోవడానికే సంజయ్ కుమార్ యాదవ్ గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, రఫిక కూతురు సిర్దాన్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ లకు దిక్కు లేకుండా పోయింది. మక్సూద్ కుటుంబ సభ్యులందరినీ సంజయ్ చంపేయడంతో వారిని చూసేవారు లేకుండా పోయారు. అదే సమయంలో రఫిక భర్త ఏమయ్యాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 9 మందిని హత్య చేయడానికి వాడిన 60 నిద్రమాత్రలను నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ఎక్కడి నుంచి పొందాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిద్రమాత్రలను పొడిగా చేసి దాన్ని విందులోని ఆహారంలో కలిపి 9 మంది స్పృహ తప్పేలా చేసి, వారిని సంజయ్ బావిలో పడేసినట్లు భావిస్తున్నారు. దీంతో ఔషధ నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. 

ప్రిస్క్రిప్షన్ లేకుండా సంజయ్ కుమార్ యాదవ్ కు నిద్రమాత్రలు ఎలా ఇచ్చారనే విషయంపై అంతర్గత విచారణ ప్రారంభమైంది. వరంగల్ నగరంలోని పలు మెడికల్ ఏజెన్సీలు, షాపుల్లో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ రఫీ తనిఖీలు చేపట్టారు. స్టాక్ పొజిషన్ ను పరిశీలిస్తున్నారు. 

రఫిక అనే తన ప్రేయసి హత్యను కప్పిపుచ్చుకోవడానికి సంజయ్ కుమార్ యాదవ్ గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios