Asianet News TeluguAsianet News Telugu

గొర్రెకుంట సామూహిక హత్యలు: వెలుగులోకి విస్తుబోయే విషయాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన 9 మంది మృతదేహాల విషయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 మందిని హత్య చేసిన సంజయ్ మరిన్ని విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

Gorrekunta mass killings: Sanjay Kumar killed Babloo
Author
Warangal, First Published Jun 2, 2020, 3:58 PM IST

వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెకుంటలో 9 మందిని సంజయ్ కుమార్ యాదవ్ అనే యువకుడు హత్య చేసిన విషయం తెలిసిందే. నిద్రమాత్రలు ఇచ్చి, ఆ తర్వాత ఒక్కరొక్కరిని గోనెసంచీలో లాక్కెళ్లి బావిలో పడేశాడు. అయితే, మక్సూదు కూతురు బుస్రా ఖతూర్ కుమారుడు బబ్లూను అతను గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు తెలుస్తోంది.

పోలీసు విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ పలు విషయాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. కోర్టు అనుమతితో సంజయ్ ను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆది, సోమవారాల్లో అతన్ని విచారించారు. అంతేకాకుండా కాకుండా ఘటనాస్థలం, గోదాముల ప్రాంతం, గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ ఆదర్శ్ నగర్ లో అతను అద్దెకు ఉంటున్న ప్రాంతం, నిద్రమాత్రలు కొనుగోలుచ చేసిన మెడికల్ షాప్ ప్రాంతాల్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో పోలీసులకు విస్మయం కలిగించే విషయాలు అందినట్లు సమాచారం. సంజయ్ కుమార్ 9 మందికి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత వారు స్పృహ తప్పి తర్వాత ఒక్కొక్కరినీ గోనసెంచీలో తీసుకుని వెళ్లి ప్రాణాలతో ఉండగానే బావిలో పడేసినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, మరికొన్ని విషయాలు సీన్ రీకన్ స్ట్రక్షన్ సందర్భంగా వారు తెలుసుకున్నట్లు సమాచారం. 

మక్సూద్ కూతురు బుస్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు బబ్లూను బతికి ఉండగానే గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. బబ్లూ ఊపిరాకడక చనిపోయాడని, అతనికి ఎక్కువ మోతాదులో విషం ఎక్కలేదని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. 

మే 21వ తేదీ రాత్రి గొర్రెకుంటలోని గోనెసంచుల గోదాంలో 9 మందికి ఆహారంలో నిద్రమాత్రల పొడి కలిపి ఇచ్చిన తర్వాత సంజయ్ బయటకు వచ్చి కొంత దూరం కాలినడకన అక్కడక్కడ తిరిగాడని, ఆ తర్వాత తన ఆచూకీని పోలీసు జాగిలాలు గుర్తించకుండా పలు చోట్ల కాళ్లు కడుకున్నాడని తెలుస్తోంది. సైకిల్ మీద వరంగల్ చౌరస్తా, ఇంతేజార్ గంజ్ ప్రాంతాల్లో సంచరించాడని చెబుతున్నారు. 

ఆ తర్వాత సంజయ్ ఆర్థరాత్రి గోదాం వద్దకు వచ్చే ముందు వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నిషాకు ఫోన్ చేశాడని, ఆమె మత్తులోనే హా.. అని అనడం తప్ప మరో మాట మాట్లాడలేదని అంటున్నారు. గోదాం వద్దకు తిరిగి వచ్చిన అతనికి బబ్లూ ఏడ్చుకుం్టూ కనిపించాడని, దాంతో అతన్ని గొంతు నులిమి చంపి బావిలో పడేశాడని చెబుతున్నారు. 

పోలీసులు ఇప్పటి వరకు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సెల్ ఫోన్లు ఎక్కడున్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి సంజయ్ ను విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios