తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులకు తీపికబురు...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 3, Sep 2018, 3:05 PM IST
Good news for telangana government employees
Highlights

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపారు. వారికి ఒక విడత కరువు భత్యం(డీఎ) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు డీఏ(కరువు భత్యం) విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వోద్యుగులందరికి ఒక విడత డీఏ చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి 1.572 శాతం డిఏ చెల్లించాలనే ఉత్తర్వులపై సిఎం సోమవారం సంతకం చేశారు. ఈ పెంపుతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 27.24 శాతానికి చేరుకుంది.

సీఎం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ అభ్యర్థన మేరకు స్పందించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
 
 

loader