శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.1.27 కోట్ల బంగారం సీజ్: ఇద్దరు అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని  అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. 

Gold Worth Over Rs 1.27 Crore Seized From Two Passengers At Hyderabad  Shamshabad Airport lns

హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తుండగా సోమవారంనాడు అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు  ప్రయాణీకుల నుండి రూ.1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి, జడ్డా నుండి వచ్చిన ఇద్దరి వద్ద అక్రమ బంగారం గుర్తించారు అధికారులు. క్యాప్సూల్స్ రూపంలో బంగారాన్ని తెచ్చారు  ఇద్దరు ప్రయాణీకులు.

గతంలో  కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  బంగారం తీసుకువస్తూ  పలువురు అరెస్టైన ఘటనలు  అనేకం నమోదయ్యాయి.  2022  ఆగష్టు  14వ తేదీన  హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  రూ. 13.63 లక్షల  విలువైన  బంగారాన్ని సీజ్  చేశారు.  లోదుస్తుల్లో   ప్రయాణీకులు  బంగారాన్ని తరలించారు. 2022  అక్టోబర్  06వ తేదీన   శంషాబాద్  ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని  అధికారులు సీజ్  చేశారు.  దీని విలువ  సుమారు  రూ.3.5 కోట్లుగా  అధికారులు  గుర్తించారు. 

2022 నవంబర్  12న  ఐదున్నర కిలోల బంగారాన్ని  శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ప్రయాణీకుల  నుండి  కస్టమ్స్ అధికారుల  సీజ్  చేశారు.   పేస్ట్  రూపంలోకి బంగారాన్ని మార్చి  తరలిస్తున్న సమయంలో   అధికారులు  సీజ్  చేశారు.   ఈ ఏడాది ఫిబ్రవరి  14న  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  14 కిలోల బంగారాన్ని అధికారులు  సీజ్  చేశారు. సూడాన్ నుండి వచ్చిన 23 మంది  ప్రయాణీకుల నుండి  14 కిలోల బంగారాన్ని సీజ్  చేశారు. 

శంషాబాద్  ఎయిర్ పోర్టులో అక్రమంగా బంగారం  తరలిస్తున్న వ్యక్తిని  అధికారులు  ఈ  ఏడాది ఫిబ్రవరి  25న అరెస్ట్  చేశారు. రూ. 47 లక్షల విలువైన  బంగారాన్ని కస్టమ్స్  అధికారులు  సీజ్  చేశారు.ఈ ఏడాది మే  24న  ఎమర్జెన్సీ లైట్ లో బంగారం తీసుకువస్తున్న సమయంలో  అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.80 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏపీకి చెందిన కడపకు చెందిన ప్రయాణీకుడి నుండి  అధికారులు గుర్తించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios