Asianet News TeluguAsianet News Telugu

జూలై 11 నుంచి గోల్కొండ బోనాలు .. ఈసారి భక్తులను అనుమతించే ఛాన్స్..?

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ప్రధాన పండగ బోనాలు. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలు జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గతేడాది ప్రజలను దర్శనానికి అనుమతించ లేదు. ఆలయ కమిటీ సభ్యులే ఉత్సవాలు జరిపించేశారు.

golconda bonalu starts from july 11th ksp
Author
Hyderabad, First Published Jun 21, 2021, 9:23 AM IST

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ప్రధాన పండగ బోనాలు. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలు జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గతేడాది ప్రజలను దర్శనానికి అనుమతించ లేదు. ఆలయ కమిటీ సభ్యులే ఉత్సవాలు జరిపించేశారు. ఈ సారి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రజలకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో బోనాలు ప్రారంభం కావడం ఆనవాయితీ.

Also Read:తెలంగాణలో అదుపులోకి కరోనా: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ‘‘సున్నా’’ కేసులు

ఏటా ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ బోనాలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది అమావాస్య జూలై 10న వస్తుండడంతో 11వ తేదీ ఆదివారం నుంచి బోనాల జాతర మొదలుకానుంది. ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. తిరిగి గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios