Asianet News TeluguAsianet News Telugu

భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ...

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

godavari water high level first alert issued in bhadrachalam - bsb
Author
Hyderabad, First Published Jul 24, 2021, 11:11 AM IST

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నిన్న 20 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఈ ఉదయానికిి 43 అడుగులకు చేరింది. 

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సహాయం కోసం 9392919743 నంబరుకు ఫొటోలు వాట్సాప్ చేయాలని అధికారులు సూచించారు.

లోతట్టు ప్రాంత ప్రజల అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రలకు తరలించారు. అత్యవసర సేవ కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 08744241950, 08743 23244 సంప్రదించాలని అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios