భద్రాచలం వద్ద 68 అడుగులకు చేరిన గోదావరి:48 గంటలు అప్రమత్తం

భధ్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది 68 అడుగులకు చేరింది. ఇవాళ రాత్రికి గోదావరి నది భద్రాచలం వద్ద 70 అడుగులను దాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. 

Godavari River Croses 68 Feet At Bhadrachalam

ఖమ్మం: Bhadrachalam వద్ద Godavari వరద ఉధృతి పెరిగింది.  ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులకు చేరింది. ఎగువ నుండ వస్తున్న వరద కారణంగా గోదావరి 73 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరో 48 గంటల పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.  ప్రస్తుతం 21 లక్షల క్యూసెక్కులకు పైగా Flood Water  భధ్రాచలం నుండి దిగువకు విడుదల అవుతుంది. ఇప్పటికే భద్రాచలం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన సుమారు 4600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

 గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం చుట్టూ వరద నీరు చేరుకుంది. భద్రాచలం పట్టణానికి వచ్చే మార్గాల్లో గోదావరి నది ముంచెత్తింది.  దీంతో భధ్రాచలం పట్టణానికి వరద వచ్చే అవకాశం లేకుండా పోయింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న చర్ల, దుమ్ముగూడెంలలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 

1986 తర్వాత గోదావరి ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం పట్టణం వద్ద ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరు వైపులా పోలీసులు మోహరించి వాహనాలతో పాటు ప్రజలను కూడా బ్రిడ్జిపై రాకపోకలు సాగించకుండా నియంత్రిస్తున్నారు. 

మరో వైపు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి పక్కనే కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కొత్త Bridge  నిర్మాణం ఏర్పాటు చేసిన పిల్లర్ల ఎత్తులో గోదావరి వరద నీరు ప్రవాహిస్తుంది. మరికొన్ని గంటల్లో గోదావరి నది భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ  రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నది 73 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

also read:వరదల్లో కారుతో సహా గల్లంతు: జగిత్యాల జిల్లాలో రిపోర్టర్ జమీర్ మృతి

భద్రాచలం పట్టణానికి ఎగువన ఉన్న ప్రాంతాల నుండి వరద పోటెత్తింది. భద్రాచలం పట్టణానికి కరకట్ట నిర్మించడంతో పట్టణంలోకి పెద్దగా వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేసినట్టైందని స్థానికులు చెబుతున్నారు. కరకట్ట నిర్మాణం చేపట్టకపోతే వరద నీరు మరింతగా భద్రాచలం పట్టణంలోకి వచ్చేదనే  అభిప్రాయంతో స్థానికులు ఉన్నారు.భద్రాచలం నుండి వస్తున్న వరద కారణంగా ధవళేశ్వరం వద్ద కూడా వరద పోటెత్తుతుంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం నుండి సుమారు 23 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంది. 2020 లో కూడా 23 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios