గోదావరి ఎక్స్ ప్రెస్ ఘట్ కేసర్  సమీపంలో  ఇవాళ పట్టాలు తప్పింది. పెద్ద శబ్దంతో  రైలు పట్టాలు తప్పిందని  ప్రయాణీకులు  చెబుతున్నారు. 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం నాడు చేరుకుంది. పట్టాలు తప్పిన ఐదు బోగీలను ఘట్ కేసర్ సమీపంలోనే వదిలి 
ఇతర బోగీలతో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. 

విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్‌కి గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. బుధవారం నాడు ఉదయం 05:30 గంటల సమయంలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘట్ కేసర్ వద్దకు రైలు రాగానే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు పెద్ద శబ్దంతో పట్టాలు తప్పాయి. ఎస్ -1, ఎస్ -2, ఎస్ -3, ఎస్ -4, ఎస్ఎల్ఆర్ , జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. 

also read:గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

పట్టాలు తప్పిన ప్రాంతంలో ఇటీవల కాలంలోనే రిపేర్ చేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ .వేగంగా వెళ్తున్న సమయంలో ఐదు బోగీలు పట్టాలపై నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఐదు బోగీలు పట్టాలు తప్పినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలు తప్పిన ఐదు బోగీలను ఘటన్ కేసర్ వద్దే వదిలి మిగిలిన బోగీలతో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరింది. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏమిటనే విషయమై రైల్వే అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పిన రైలు బోగీలను దక్షిణ మద్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఎస్-4 బోగీని పట్టాలపైకి చేర్చారు. మిగిలిన బోగీలను కూడా పట్టాలపైకి చేర్చుతున్నారు.ఘట్ కేసర్ వద్ద గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విశాఖపట్టణం నుండి 16 ోగీలతో గోదావరి ఎక్స్ ప్ుెస్ రైలు బయలుదేరింది. ఘట్ కేసర్ వద్దకు రాగానే ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు.

 ఈ ఘటనకు సంబందించి రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రకటించింది. ప్రయాణీకులు ఏదైనా అవసరం ఉంటే 040-27786666 నెంబర్ కు ఫోన్ చేయాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులు కోరారు.