నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. బైంసా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈమెను దీపికగా గుర్తించారు. బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీపికను గుర్తించిన తోటి విద్యార్ధులు, సిబ్బంది ఆమెను హుటాహుటిన బైంసాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీపిక తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

అంతకుముందు హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలికల హాస్టల్ క్యాంపస్ భవనం మీది నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వంశికగా గుర్తించారు. ఆమెది కామారెడ్డి జిల్లాగా చెబుతున్నారు. వంశిక వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరినట్లుగా సమాచారం.