ప్రస్తుత కాలంలో చాలా మంది యువత... ప్రేమలో హద్దులు దాటుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కకముందే.. పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో యువతులు గర్భవతులు కూడా అవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి లో చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే తొందరపడటంతో... యువతి గర్భవతి అయ్యింది. ఈ విషయం బయటకు తెలిస్తే.. కష్టమని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసుల దీనిపై దర్యాప్తు చేపట్టారు. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన ఓ ప్రేమజంట తొందరపాటుతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ప్రియుడు, అమ్మాయి బంధువులతో కలిసి ఆమెకు అబార్షన్ చేయించేందుకు షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి ఓ డాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు అబార్షన్ చేశాడు. ఈ విషయం గురువారం బయటకు పొక్కడంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రేమ జంట, వారి బంధువులు, డాక్టర్ అప్పటికే ఆస్పత్రి నుంచి పరారయ్యారు. 

పోలీసులు ఇప్పుడు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. అబార్షన్ చేయించడం, చేయడం చట్టరిత్యా నేరం. దీంతో... అబార్షన్ చేయించుకున్న ప్రేమ జంట,  చేసిన డాక్టర్ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.