తండ్రి బెస్ట్ ఫ్రెండ్ నీచ బుద్ధి బయటపెడితే.. నమ్ముతారో లేదో అనే అనుమానంతో బయటపెట్టలేకపోయింది. వేధింపులు ఎక్కువ అవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. 

స్నేహితుడి కూతురిని.. కూతురిలా భావించాల్సిన వ్యక్తి ప్రేమ పేరిట లైంగిక వేధించాడు. తండ్రి బెస్ట్ ఫ్రెండ్ నీచ బుద్ధి బయటపెడితే.. నమ్ముతారో లేదో అనే అనుమానంతో బయటపెట్టలేకపోయింది. వేధింపులు ఎక్కువ అవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో మంగళ వారం అర్ధరాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. మృతురాలు ఇంటర్‌ విద్యార్థిని గూడూరు భవాని! కుటుంబ సభ్యులు, ఇంతెజార్‌గంజ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. భవాని వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది.

కాలేజీకి వెళ్లి వస్తుండగా గూడురు రవి స్నేహితుడు ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన వడ్డెపల్లి సంతోష్‌.. భవానిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. ఇంటి పక్కనున్న పోరండ్ల భిక్షపతి కూడా సంతోష్ ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. వీరి వేధింపులు భరించలేక భవాని మంగళవారం అర్ధరాత్రి బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుంది. ‘డాడీ.. నీ ఫ్రెండే నన్ను టార్చర్‌ చేస్తున్నాడు. నీకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్‌ నోట్‌లో రాసిం ది. సంతోష్‌ పేరుతో పాటు బిక్షపతి పేరును పేర్కొన్నది. కాగా, రవి ఫిర్యాదు మేరకు వడ్డెపల్లి సంతోష్‌, బిక్షపతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.