Asianet News TeluguAsianet News Telugu

తాండూరు కందులకు జీఐ గుర్తింపు.. తెలంగాణకు 16వ జీఐ ప్రాడక్ట్

తాండూరు కందులకు జీఐ గుర్తింపు దక్కింది. వికారాబాద్, నారాయణ్‌పేట్, సంగారెడ్డి, ఆదిలాబాద్‌‌ల రీజియన్‌లో పండే ఈ కందులు అత్యంత నాణ్యమైనవిగా పేరున్నది. మంచి రుచికి, వంటకు, దీర్ఘకాలం నిల్వ చేసుకోవడానికి ఈ కందులు అనుకూలంగా ఉంటాయి.
 

GI tag for tandur redgram, 16th GI product for telangana
Author
First Published Dec 15, 2022, 4:28 PM IST

హైదరాబాద్: తెలంగాణలోని ఫేమస్ తాండూరు కందులకు జీఐ గుర్తింపు దక్కింది. యాలాల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ తాండూరు కందులకు జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. ఈ ప్రక్రియను జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పర్యవేక్షించింది. గైడెన్స్, రీసెర్చ్, సాంకేతిక వివరాలు మొత్తం ఈ యూనివర్సిటీనే అందించింది. ఈ గుర్తింపుతో మన దేశంలో మొత్తం 432 ప్రాడక్ట్‌లు జీఐ గుర్తింపు పొందాయి. కాగా, ఇది తెలంగాణకు 16వది. 2025 నాటికి దేశంలో 5 వేలకు మించి జీఐ గుర్తింపు ఉత్పత్తులు ఉంటాయని, అందులో తెలంగాణ అగ్రభాగంలో ఉంటుందని జీఐ ఏజెంట్, రిజల్యూట్ గ్రూప్ లీగల్ హెడల్ సుభజిత్ సాహా అన్నారు. నిజామాబాద్ పసుపు, బాలానగర్ కస్టర్డ్ యాపిల్, ఇంకా అనేక సాగు ఉత్పత్తులను జీఐ గుర్తింపు కోసం పరిశీలించాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. 

తాండూరు కందులు ఫేమస్. రుచిలో వాటికి తిరుగులేదనే అభిప్రాయం ఉన్నది. తాండూరు, దాని చుట్టుపక్క ప్రాంతాల భూముల్లో వర్షంపై ఆధారపడే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ పంట ముఖ్యంగా వికారాబాద్, నారాయణ్‌పేట్, సంగారెడ్డి, ఆదిలాబాద్‌లలో పండుతుంది. అత్తపుల్గైట్ ఖనిజ లవణాలు, సున్నపురాయి నిల్వలు ఇక్కడి కందుల ప్రత్యేకతకు దోహదపడుతున్నట్టు చెబుతుంటారు. ఈ కందుల్లో ఇతర ధాన్యాల్లో కంటే మూడు రెట్లు అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మంచి రుచికి, వంటకు, దీర్ఘకాలం నిల్వకు అనుకూలంగా ఉంటాయి.

Also Read: ఘర్ ఘర్ జిఐ .. కొత్త సంప్రదాయానికి శ్రీకారం.. చిన్న కళాకారులకు ప్రోత్సాహం

తాండూర్ రైతులు, దాల్ మిల్ ఓనర్లు స్వయంగా రిజిస్ట్రేషన్ పొంది ఈ జీఐ ట్యాగ్‌ను తాండూరు కందులకు వినియోగించుకోవచ్చు. తద్వారా జీఐ ట్యాగ్ ద్వారా ఎక్కువ ధరలు పొందవచ్చును. తాండూరు కందుల క్వాలిటీకి జీఐ భరోసా ఇస్తున్నట్టు లెక్క.

జీఐ ట్యాగ్‌తో ప్రాసెస్ చేసిన కంది పప్పుకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నది. ‘తాండూరు కందుల’ సాగులో రైతులు, కూలీలు, వ్యాపారులు మొత్తం సుమారు 63,500 కుటుంబాలు భాగమై ఉన్నాయి. ఒక ఏడాది కాలంలో 4.75 లక్షల క్వింటాళ్ల తాండూరు కందులు పండిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios