హైదరాబాద్ లో దారుణం... పారశుద్ద్య కార్మికురాలిని ఈడ్చుకెళ్ళి చెట్టును ఢీకొన్న బస్సు (సిసి ఫుటేజి)

రోడ్డును శుభ్రం చేస్తుండగా పారిశుద్ద్య కార్మికురాలిపైకి మెడికల్ కాలేజీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

GHMC worker death in accident at Ramkoti AKP

హైదరాబాద్ : రోజూ మాదిరిగానే ఇవాళ కూడా తెల్లవారుజామునే నిద్రలేచిన ఆమె నగరాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లి ఘోర ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుపక్కన ఊడుస్తున్న ఆమెపైకి ఓ ప్రైవేట్ మెడికల్ కాలేేజీ బస్సు రూపంలో మృత్యువు దూసుకువచ్చింది. ఇలా మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన బస్సు పారిశుద్ద్య కార్మికురాలిని చిదిమేసింది. ఈ దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ అంబర్ పేట సర్కిల్ లో టి. సునీత పారిశుద్ద్య కార్మికురాలిగా పనిచేస్తోంది. రోజూ మాదిరిగానే ఇవాళ కూడా ఆమె తెల్లవారుజామునే తోటి కార్మికులతో కలిసి నగరాన్ని శుభ్రం చేయడం ప్రారంభించింది. ఇలా రామ్ కోటి ప్రాంతంలో రోడ్డుపక్కన ఊడుస్తుండగా మొయినాబాద్ లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ బస్సు విద్యార్థులను తీసుకెళుతూ అటువైపు వచ్చింది. వేగంగా వెళుతూ ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కకు దూసుకొచ్చి కాార్మికురాలిని ఢీకొట్టింది. బస్సు కార్మికురాలిని ఈడ్చుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు, చెట్టు మద్యలో ఇరుక్కుపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సులోని నలుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు. 

వీడియో

ప్రమాదంపై సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి అధికారులు, నారాయణగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పారిశుద్ద్య కార్మికురాలి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ నిర్లక్ష్యమే కార్మికురాలిని బలితీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

Read More  మంచిర్యాల జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లో యువకుడు మృతి.. అసలేం జరిగింది..?

ఈ ప్రమాదం దగ్గర్లోని సిసి కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. కార్మికురాలు తనపని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా ఆమెపైకి బస్సు దూకువచ్చి ప్రాణాలు తీసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఉదయం అందరూ పనులకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరగడంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను నియంత్రించారు. 

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios