జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐ ఫోన్‌ల కోసం పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలోని సభ్యులు తమకు ఐ ఫోన్ కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

మొత్తం 17 మందికి ఐఫోన్‌లు కావాలంటూ ప్రతిపాదనలు పంపారు. మార్కెట్‌లోకి స్టాక్ లేకపోవడంతో కొనుగోళ్లు వాయిదా వేసింది జీహెచ్ఎంసీ. వీటికి రూ.27,23,000 ఖర్చవుతుందని తేల్చారు.

తీరా చూస్తే ఇందులో వున్న వారు ఏడుగురు మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరో 15 రోజుల్లో పదవీ కాలం ముగిసిపోయే ముందు ఐఫోన్‌ల కోసం స్టాండింగ్ కమిటీ పట్టుబట్టడం తీవ్ర దుమారం రేపుతోంది.