కేసీఆర్ కౌంట్‌డౌన్ డిజిటల్ బోర్డు: బీజేపీకి రూ. 50 వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

కేసీఆర్ కౌంట్ డౌన్ అంటూ తమ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు రూ. 50 వేల జరిమానాను విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధిస్తామని కూడా జీహెచ్ఎంసీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

GHMC Fines BJP  Rs.50000 For Installing kCR Countdown Digital Board

హైదరాబాద్: TRS, BJP మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన KCR కౌంట్ డౌన్ డిజిటల్ బోర్డుకి GHMC   రూ. 50 వేల Fineను విధించారు.  అంతేకాదు రోడ్డుకు అడ్డంగా బీజేపీకి  చెందిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే ఇవాళ సాయంత్రం వరకు తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. లేకపోతే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.

also read:‘‘సాలు మోదీ.. సంపకు మోదీ’’.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు..

వచ్చే నెల 2, 3 తేదీల్లో Hyderabadలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను  నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాలను పురస్కరించుకొని బీజేపీ నేతలు నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీ, కటౌట్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే బీజేపీ నేతల కంటే ముందే టీఆర్ఎస్ నేతలు  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ కటౌట్లు, బోర్డులను ఏర్పాటు చేశారు. 

 

గత వారంలో బీజేపీ తన కార్యాలయం వద్ద కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ కూడా కౌంటర్ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. చంపకు మోడీ అంటూ బీజేపీ తీరును ఎండగడుతూ టీఆర్ఎస్ నేతలు తాజాగా డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. మరో వైపు బీజేపీ కార్యాలయం వద్ద కేసీఆర్ కౌంట్ డౌన్  పేరుతో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ  రూ. 50 వేల ఫైన్ విధించారు.

కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కూడా మోడీకి వ్యతిరేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేసింది.  అంతేకాదు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని బీజేపీ నేతలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే బీజేపీ కంటే ముందే  నగరంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ కంటే టీఆర్ఎస్ హైద్రాబాద్ లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios