Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎంను ఎందుకు ప్రశ్నించరు: కేటీఆర్ మీద విజయశాంతి మండిపాటు

హిందువులపై అంత గుడ్డి ద్వేషం ఎందుకని ఎంఐఎం నేతను ఎందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ నిలదీయలేదని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని విజయశాంతి విమర్శించారు. 

GHMC elections: Vijayashanti questions KTR
Author
New Delhi, First Published Nov 24, 2020, 6:55 PM IST

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. జిహెచ్ఎంసీలో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. బిజెపి అగ్ర నేతలతో భేటీ కావడం కోసం విజయశాంతి ఢల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆమె కేటీఆర్ ను నిలదీశారు. 

గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కిన ఎంఐఎం నేతను కేటీఆర్ ఎందుకు ప్రశ్నించలేకపోయారని తెలంగాణ రాములమ్మ అడిగారు. ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకని ఓ ప్రధాన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ప్రశ్నించారు ఇన్నేళ్లు టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు గుర్తు లేదన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. 

15 నిమిషాలు వదిలేస్తే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తానని ఎంఐఎం నేత అన్నారని, తన వర్గంవారంతా కలిసి ఉమ్మేస్తే చాలు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడని ఆమె గుర్తు చేశారు. 

హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడారని ఆమె గుర్తు చేస్తూ హిందువులపై అంత గుడ్డి ద్వేషం ఎందుకని ఎంఐఎం నాయకుడిని కేటీఆర్ ఎందుకు నిలదీయలేదని ఆమె అడిగారు. దీన్నిబట్టి చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోందని విజయశాంతి అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios