జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్‌ జరిగింది. నామినేషన్‌ పరిశీలనలో భాగంగా కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద శ్రీశైలం​ గౌడ్‌ ఆందోళనకు దిగారు.

టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.