హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావుపై శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకేం తక్కువ చేశాను, నిన్ను తీసుకొచ్చి శాసన మండలి చైర్మన్ ను చేశానని కేసీఆర్ అన్నారని ఆయన గుర్తు చేస్తూ తాను రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చి శాసన మండలి చైర్మన్ ను చేయలేదని ఆయన అన్నారు. 

కేసీఆర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న స్వామి గౌడ్ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.  కొత్త బట్టలు కొనిచ్చాను, ముడ్డి మీద తంతాను పడు అంటే పడేది లేదని ఆయన అన్నారు.

రెండు సార్లు తనను పోలీసులు చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. దంపతుల్లారా, ముగ్గురు ముగ్గురు బిడ్డలను కనండని ఆయన పిలుపునిచ్చారు.శాసన మండలి చైర్మన్ గా తాను అదే మాట అంటే రచ్చ చేశారని, మరోసారి తాను ఇప్పుడు అదే మాట చెబుతున్నానని ఆయన అన్నారు.  

రెండు నిమిషాల అపాయింట్ మెంట్ కేసీఆర్ రెండేళ్ల నుంచి ఇవ్వలేదని స్వామి గౌడ్ అన్నారు.