హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి దూసుకెళ్లింది. పోస్టల్ బ్యాలెట్ లో చాలా వరకు బిజెపి ఆధిక్యం ప్రదర్శించింది. తిరుగులేని ఆధిక్యంలో బిజెపి కొనసాగింది. దీన్నిబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంపై ఉద్యోగుల వైఖరికి అద్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేవారు ప్రభుత్వోద్యోగులే. అందువల్ల కెసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి దాదాపు 55 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగగా, టీఆర్ఎస్ 30 స్థానాల్లో మాత్రమే ఆదిక్యంలో కొనసాగింిది.

మొత్తం పోస్టల్  బ్యాలెటిల్ 1965 ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లలేదు. అయితే ఒక్కో డివిజన్ లో పోస్టలు బ్యాలెట్ ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఫలితాలను వాటిని బేరీజు వేయడం సాధ్యం కాదు. 

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల మనోగతాన్ని కూడా అంచనా వేయలేం. తుది ఫలితాలు దాన్ని బట్టి ఏ మాత్రం ఆధారపడి ఉండవు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధారంగా మొత్తం ఉద్యోగుల అభిప్రాయాన్ని కూడా అంచనా వేయలేం.