Asianet News TeluguAsianet News Telugu

అమ్మమ్మను చూసి నేర్చుకోండి.. థ్యాంక్యూ అమ్మమ్మ : కేటీఆర్

జీహెచ్ఎంసీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మద్యాహ్నం గడుస్తున్నా 20 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. మొత్తంగా 50 శాతం పోలింగ్ అవుతుందో లేదో అనుమానంగా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, యువకులు ఓటింగ్ మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీరికి ఆదర్శంగా నిలుస్తున్నారు వికలాంగులు, వృద్ధులు. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసి ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. 

ghmc elections 2020 : Many thanks to your Ammama ktr tweet on Senior citizen voting - bsb
Author
Hyderabad, First Published Dec 1, 2020, 1:55 PM IST

జీహెచ్ఎంసీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మద్యాహ్నం గడుస్తున్నా 20 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. మొత్తంగా 50 శాతం పోలింగ్ అవుతుందో లేదో అనుమానంగా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, యువకులు ఓటింగ్ మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీరికి ఆదర్శంగా నిలుస్తున్నారు వికలాంగులు, వృద్ధులు. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసి ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో  80 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె  మనవరాలు  ట్విటర్‌ యూజర్‌ పద్మశ్రీ ట్విటర్‌లో వెల్లడించారు. తన  అమ్మమ్మకు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు లాక్‌డౌన్‌ తరువాత  తొలిసారి గడప దాటి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. 

ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ  దీన్ని మంత్రి  కేటీఆర్‌కు ట్యాగ్‌ చేయగా, ఆయన స్పందించారు. అమ్మమ్మకు చాలా థ్యాంక్స్‌ అంటూ రిప్లై ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప  బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్‌ చేశారు.  

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఓటర్లు లేక  పోలింగ్‌ కేంద్రాలు బోసి పోసి కనిపిస్తున్నాయి.  దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు  గ్రేటర్‌ మేయర్ పీఠంపై కన్నేసిన టీఆర్‌ఎస్‌, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 

అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ రిగ్గింగ్‌కు పాల‍్పడుతోందని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  దీంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్‌ మలక్‌పేటలో పోలింగ్‌ రద్దయింది.  ఓల్డ్‌ మలక్‌పేట 69వ డివిజన్‌లో రీపోలింగ్‌   నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios