Asianet News TeluguAsianet News Telugu

మొదలైన కౌంటింగ్.. తొలి ఫలితం 11గంటల తర్వాతే..!

ఇప్పటి వరకూ 1,926 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్‌ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తారు.
 

GHMC Elections 2020: Counting started today
Author
Hyderabad, First Published Dec 4, 2020, 8:32 AM IST

గ్రేటర్ ఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యింది. ఫలితం వెలువడే రోజు రానే వచ్చింది. దీంతో.. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.  మరికాసేపట్లో విజయం ఎవరికి దక్కుతుందో తెలిసిపోతోంది. ఉదయం 8గంటలకే లెక్కింపు ప్రారంభంకాగా.. 11గంటల తర్వాతే మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.

ఇప్పటి వరకూ 1,926 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్‌ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తారు.

30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది.

ఇక, ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంటుంది. అధికారులు, ఏజెంట్‌లు విధిగా మాస్కు ధరించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios