Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ సమాధిపై ఓవైసీ వ్యాఖ్యలు: చంద్రబాబు స్పందన ఇదీ...

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

GHMC Elections 2020: Chandrababu condemns Akbaruddin Owaisi comments on NTR ghat
Author
Hyderabad, First Published Nov 26, 2020, 7:51 PM IST

హైదరాబాద్: ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను కూల్చాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. నిస్వార్థ రాజకీయాలతో ప్రజల హృదయాలత్లో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారిగా ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ మీద ఈ రకమైన వ్యాఖ్యలుచేయడం తెలుగువారందరనీ అవమానించడమేనని ఆయన అన్నారు. 

"ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు. అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ఆయన అన్నారు.

"తెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగువెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు. దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే...ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీతెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగువెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు" అని ఆయన అన్నారు.

"దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే...ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ" అని చంద్రబాబు అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios