హైదరాబాద్: తాజాగా  టీఆర్ఎస్ ఆధిక్యత 71కి పడిపోగా, బిజెపి ఆధిక్యత 35కి పెరిగింది. టీఆర్ఎస్ 72 డివిజన్లలో ఆధిక్యంలోకి రాగా, బిెజెపి 34 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. ఎంఐఎం ఆదిక్యత 40కి, కాంగ్రెసు ఆధిక్యత 3కి పడిపోయింది.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ఆధిక్యం 46 స్థానాలకు పెరగగా బిజెపి ఆధిక్యం 29కి పడిపోయింది. ఆ వెంటనే బిెజపి 31 స్థానాల్లో ఆధిక్యంలోకి రాగా, ఎంఐఎం 44 స్థానాలకు పడిపోయింది. టీఆర్ఎస్ ఆధిక్యం 71 స్థానాలకు పెరిగింది.

జిహెచ్ఎంసీ ఎన్నికల తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 68 స్థానాల్లో, బిజెపి 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.  టీఆర్ఎస్ తిరిగి 70 స్థానాల్లో అధిక్యంలోకి రాగా, బిెజపి ఆధిక్యం 30 స్థానాలకు తిరిగి పడిపోయింది.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో పార్టీల ఆధిక్యాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 70 స్థానాల్లో, బిజెపి 30, ఎంఐఎం 45, కాంగ్రెసు 4 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చాయి.

తాజాగా జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 58 స్థానాల్లో, ఎంఐఎం 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎంపీఎం 30 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. బిజెపి 26 డివిజన్లలో ఆధిక్యంలోకి వచ్చింది.

టీఆర్ఎస్ 57 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. బిజెపి 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెసు రెండు స్తానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. ఎఎస్ రావు నగర్ డివిజన్ లో కాంగ్రెసు అభ్యర్థి శిరీష రెడ్డి విజయం సాధించారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. తాజాగా టీఆర్ఎస్ 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఎంఐఎం 22 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది.

టీఆర్ఎస్ 34 డివిజన్లలో ఆధిక్యంలోకి వచ్చింది. రెండో స్థానంలో బిజెపి కొనసాగుతోంది.

తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 33 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. యూసుఫ్ గుడాలో టీఆర్ఎస్ విజయం సాధించింది.

టీఆర్ఎస్ 32 డివిజన్లలో, బిజెపి 8 స్థానాల్లో, ఎంఐఎం 8 స్థానాల్లో, కాంగ్రెసు 1 డివిజన్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడింది. మెహిదీపట్నం డివిజన్ లో ఎంఐఎం విజయం సాధించింది.

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 31, బిజెపి 12, ఎంఐఎం 7, కాంగ్రెసు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు దాదాపుగా తిరగబడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తిరుగులేని ఆధిక్యత సాధించిన బిజెపి ఓట్ల లెక్కింపులో వెనకంజలోకి వెళ్లింది. తొలి రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం కొనసాగుతోంది.

కడపటి ఫలితాలను బట్టి టీఆర్ఎస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి, ఎంఐఎం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. బిజెపి, ఎంఐఎం ఏడేసి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి చెర్లపల్లి డివిజన్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

ఈ నెల 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. జిహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకు పోలింగ్ జరిగింది.