హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాతబ6స్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉన్నారని, తాము మేయర్ పీఠాన్ని అధిష్టించగానే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. 

హైదరాబాదు పాతబస్తీలో పాకిస్తానీలు ఎవరున్నారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ బిజెపి నేతలను డిమాండ్ చేశారు. తాను 24 గంటల సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  చైనా 970 చకిమీ భూభాగాన్ని అక్రమించుకుందని, అమిత్ షాకు దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రయిక్ చేయానలి ఆయన అన్నారు. 

దేశంలో ఉన్నవాళ్లంతా ఇండియన్లేనని, దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరని ఆయన అన్నారు. బిజెపి ఎంపీ ఒకరు తనను జిన్నాతో పోలుస్తున్నారని, జిన్నాకు తమకు సంబంధం ఏమిటని ఆయన అన్నారు. దమ్ముంటే పాకిస్తాన్, టెర్రరిస్టు పదాలు వాడకుండా ఈ నెల 29 వరకు ప్రచారం చేయాలని తాను ఆర్ఎస్ఎస్, బిజెపిలకు సవాల్ విసురుతున్నట్లు ఆయన తెలిపారు. దమ్ముంటే అభివృద్ధి, చదువు గురించి మాట్లాడాలని ఆయన అన్నారు. బిజెపిలో అసహనం కనిపిస్తోందని ఆయన అన్నారు 

హైదరాబాదులో 30 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బిజెపి నేతలు చెబుతున్నారని అంటూ వారంత మంది ఉంటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఓవైసీ ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారువు తిప్పికొట్టిన విషయం తెలిసిందే. 

ఆమె ముస్లిం కాదు.....

నాంపల్లి శానససభ నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్ నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫాతిమాపై అసుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా ముస్లిం కాదని, హిందువు అని ఆయన అన్నారు. రాజకీయం కోసం తండ్రి పేరును మార్చారని ఆయన విమర్శించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నామినేషన్ వేసినందుకు ఆమెపై ముషీరాబాద్ పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైందని ఆయన చెప్పారు 

ఈమే బీసీ కాదు....

ఘాంసీ బజార్ బిజెపి అభ్యర్థి రేణు సోనీపై కూడా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె బీసీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో నామినేషన్ వేశారని ఆయన ఆరోపించారు. రేణు సోనీకి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇద్దరే పిల్లలని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన చెప్పారు. మరో సంతానం ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. 

అసదుద్దీన్ వ్యాఖ్యలపై బిజెపి శ్రేణుుల మండిపడుుతన్నాయి. ఓవైసీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.