బల్దియా ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఫలితాలు ఉదయం నుంచి విడుదలవుతున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. అయితే ఈ లెక్కింపులో అనూహ్యంగా టీఆర్ఎస్ కంటే బీజేపీ రెట్టింపు స్థాయిలో ముందంజలో ఉంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. 

మరోవైపు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 28 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కాగా కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.

డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్లు.. 

బోయిన్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్): టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7
హైదర్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1
భారతీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
గచ్చిబౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
చంపాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, కాంగ్రెస్‌ 3, టీఆర్‌ఎస్‌ 1
హస్తినాపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
కూకట్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 24, టీఆర్‌ఎస్‌ 21, టీడీపీ 2, నోటా 2
సూరారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, చెల్లనివి 2
గాజులరామారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
అల్వాల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా1, చెల్లనివి 23
జీడిమెట్ల డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 4, చెల్లనివి 1
సుభాష్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 3
కొండాపూర్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5
అల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3
మూసాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1
ఫతేనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2
బాలాజీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
మన్సూరాబాద్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 5
కవాడీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 10, టీఆర్‌ఎస్‌ 1, టీడీపీ 1
నాగోల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 13, టీఆర్ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
మాదాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మియాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
హఫీజ్‌పేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4
చందానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మూసాపేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1
బాలానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
జగద్గిరిగుట్ట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 1, టీఆర్‌ఎస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 20, బీజేపీ 14