Asianet News TeluguAsianet News Telugu

ఉద్రిక్తత: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను అడ్డుకున్న పోలీసులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. 

GHMC Election...police stopped BJP MLA Raja Singh Campaign
Author
Hyderabad, First Published Nov 29, 2020, 1:00 PM IST

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ్ నగర్ డివిజన్లో పర్యటిస్తున్న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే సౌండ్ సిస్టంను వాడుతున్నారంటూ ప్రచారాన్ని అడ్డుకున్నారు. పోలీసులతో బిజెపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇదిలావుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో అమిత్  షా బీజేపీ అభ్యర్ధుల తరపున రోడ్ షోల్లో పాల్గొంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో  ప్రత్యేక విమానంలో ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు. 

అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.  బేగంపేట ఎయిర్ పోర్టు నుండి  అమిత్ షా నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

కేంద్ర హోంమంత్రి రాక సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. అమ్మవారి దర్శనం అనంతరం నగరంలోని వారాసిగూడ చౌరస్తా నుండి సీతాఫల్ మండి వరకు రోడ్‌షోలలో అమిత్ షా  పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమిత్ షా బీజేపీ కార్యాలయానికి చేరుకొంటారు.  సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios