జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 149 పోలింగ్ ముగిసింది. గుర్తులు తారుమారుతో ఓల్డ్‌ మలక్‌‌పేట్‌‌ పోలింగ్ రద్దయ్యింది. దీంతో ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేట్‌లో రీ పోలింగ్ జరగనుంది.

రీపోలింగ్ దృష్ట్యా ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ నిషేధం విధించింది.  మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మరో అరగంటలో ముగియనుంది. కోవిడ్ భయం కారణంగా ఓటర్లు ఓటింగ్‌కు అంతగా మొగ్గుచూపలేదు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం కాస్త తర్వాత పుంజుకుంది.

మొత్తం 150 డివిజన్లకు గాను సాయంత్రం 4 గంటల నాటికి 50 శాతం పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల 20 శాతానికి కూడా పోలింగ్ చేరలేదు. వరుస సెలవులు పోలింగ్‌ శాతంపై బాగా ప్రభావం చూపాయి.