జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెడుతున్నారు.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెడుతున్నారు. ప్రజా సమస్యలపై అధికారులను ఎంఐఎం కార్పొరేటర్లు నిలదీశారు. నగరంలో ఎక్కడ చూసిన చెత్త పేరుకుపోయిందన్న ఎంఐఎం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ అన్నారు. పన్నులు కట్టే వారికి కూడా జరిమానాలు వేస్తున్నారని చెప్పారు. పన్నులు చెల్లించని వారి జోలికి మాత్రం వెళ్లడం లేదని ఆరోపించారు. ప్రాపర్టీ ట్యాక్స్ కోసం ప్రజలను పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. అయితే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సభలో మేయర్ గద్వాల విజయలక్ష్మికి, ఎంఐఎం కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్..
మరోవైపు సభలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. వరిపై ఉద్యమం చేస్తే బీజేపీ గోధుమల ఫొటోలు పెట్టి ఆరోపణలు చేస్తుందన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత అన్నారు. బీజేపీ వాళ్లకు వరికి, గోధుమలకు తేడా తెలియదని టీఆర్‌ఎస్ విమర్శించారు. దీనిపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్దిపై చర్చించకుండా పక్కదారి పట్టించేందుకు టీఆర్‌ఎస్ చూస్తుందని బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలను తొలగిస్తామని మేయర్ తెలిపారు. ఇక, బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్లు బాహాబాహీ దిగారు. ఒకరిపై ఒకరు దాడి యత్నించారు. ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు.. పోటాపోటీగా నినాదాలు చేశారు
