గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ దానకిశోర్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే ఆయనను ట్రాన్స్‌ఫర్ చేసింది. దానకిశోర్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్‌ను నియమించింది. అయితే దానకిశోర్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌కి ప్రభుత్వం కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

2018 ఆగస్టు 24న అప్పట్లో జీహెచ్ఎంసీ కమీషనర్‌గా ఉన్న జనార్థన్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ప్రభుత్వం దానకిశోర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.