ఆదిలాబాద్: పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన గీత మంగళవారం నాడు బాసరకు వచ్చింది.

ఐదేళ్ల వయస్సులోనే రైల్ ఎక్కి పాకిస్తాన్ కు వెళ్లిన గీత తన తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తోంది.సుష్మాస్వరాజ్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ లో ఉన్న  గీతను ఇండియాకు రప్పించారు.దేశంలోని పలు ప్రాంతాల్లో తల్లిదండ్రుల కోసం గీత అన్వేషించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇండోర్ లోని ఓ స్వచ్ఛంధ సంస్థలో గీత ఆశ్రయం పొందుతోంది.

తాను చిన్నతనంలో ఉన్న ప్రాంతం రైల్వేస్టేషన్, నది, ఆలయం ఉంటుందని ఆమె సైగల ద్వారా చెప్పింది. ఈ ఆనవాళ్లు బాసరలోనే ఉంటాయని స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు గీతను ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసరకు తీసుకొచ్చారు.

బాసరలోని పలు ప్రాంతాల్లో గీత పర్యటించారు. రైల్వేస్టేషన్, బాసర సరస్వతి ఆలయం, గోదావరి నది ప్రాంతాల్లో ఆమెను తిప్పి చూపారు.బాసరలో నాలుగైదు గంటల పాటు గీతతో స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు గడిపారు.20 ఏళ్ల నుండి  బాసర నుండి తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.