Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబూ! మగాడిలా రా, దొంగలా వద్దు!!

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మగాడిలా ముందుకు రావాలని, కానీ దొంగలా రావొద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. 

Gattu ramachandra Rao warns Chandrababu
Author
Hyderabad, First Published Sep 15, 2018, 4:22 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మగాడిలా ముందుకు రావాలని, కానీ దొంగలా రావొద్దని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలేనని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

చంద్రబాబు విచ్ఛిన్నకర కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా సిద్ధంగా ఉందని, చంద్రబాబు తెలివైన దొంగ అని, తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడని ఆయన అన్నారు. 

అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని, టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో తమ పార్టీకి తెలుసునని ఆయన అన్నారు. 

ఇక్కడ ఎలాంటి కుట్రలు చేయాలని చూసినా ఊరుకోబోమని, తరిమి కొడతామని హెచ్చరించారు. ఇక్కడి నుంచి చంద్రబాబు డెన్ తీసేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు తమ బాధ్యత లేదని, చంద్రబాబు భయంతో ఒక నోటీస్ పట్టుకొని తిరుగుతున్నాడని అన్నారు. 

చంద్రబాబు మీద కేసు కొట్టేయాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను కోరాలని అంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు చేసిన మోసాలకు జీవిత ఖైదు విధించాలని, తప్పుడు ఆలోచనలతో తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేస్తే చంద్రబాబుకు ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్తారని అన్నారు. 

చంద్రబాబు కుట్రలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని, కాంగ్రెస్‌లో చంద్రబాబు తన కోవర్టులను పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేకుండా చంద్రబాబు చుట్టూ తిరుగుతోందని అన్నారు.

బాబుకు జెండా, ఎజెండా లేదని, చంద్రగిరిలో కూడా చంద్రబాబు పార్టీ గెలువదని అన్నారు. చంద్రబాబువి విషపు చూపులు.. విషపు చేష్టలు అని ఆయన దుయ్యబట్టారు. ఏపీ పోలీసులను చంద్రబాబు దొంగలుగా వాడుకుంటున్నారని, ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రా బాబుకి బ్రోకర్‌గా మారాడని అన్నారు. 

వందల కోట్ల రూపాయాలు పోలీసుల ద్వారా తెలంగాణలో పంచే ప్రయత్నం చేస్తున్నాడని, ఆంధ్రా పోలీసుల్లో కూడా తెలంగాణ శ్రేయోభిలాషులు ఉన్నారని గట్టు అన్నారు. ఆంధ్రా పోలీసులే కాదు.. ఆంధ్రా ప్రజలు కూడా మా శ్రేయస్సును కోరుకుంటున్నారని అన్నారు. ఆంధ్రా ప్రజల్లో కూడా కేసీఆర్‌కు క్రేజ్ ఉందని అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఇక్కడి నుంచి పంపించాలని గవర్నర్, డీజీపీ, ఈసీకి విజ్ఞప్తి చేస్తామని గట్టు రామచంద్రరావు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios