సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట మండలం పొత్తూర్ లో ఒక్కసారిగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు. 
 
మిడ్ మానేరు ప్రాజెక్టు కింద పంటల కోసం విడతల వారీగా నీరు కిందకి విడుదల చేస్తుంటారు. అందులో భాగంగా గేట్లు ఎత్తివేశారు. అయితే గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు విడుదలవ్వడంతో పొత్తేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. 

గేట్లు ఎత్తివేస్తున్న విషయం తెలియని ఇద్దరు ట్రాక్టర్ వేసుకుని బయలు దేరారు. అయితే ఒక్కసారిగా నీరు రావడంతో ట్రాక్టర్ తో సహా కొట్టుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన స్థానికులు వారిని కాపాడారు. ట్రాక్టర్ ను సైతం కొట్టుకుపోకుండా కాపాడారు.