సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. 

సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. సైన్స్ ల్యాబ్‌లో ఈ విషవాయువులు లీకైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred