హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే ప్రమాదం చోటుచేసుకుంది. గోల్కొండ సమీపంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం బిల్డింగ్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 

కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి భవనంలో మంటలు వ్యాపించారు.  దీన్ని గమనించిన చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది భవనంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నాయి.  

ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగి వుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరైనా వున్నారా, లేదా అన్నది ఇంకా తెలియాల్సి వుంది. మంటలు అదుపులోకి వచ్చిన ఈ ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం వుంది.

స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు  నమోదు చేసుకుని గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

వీడియో

"