హైదరాబాద్ లో యూత్ రెచ్చిపోయి పుచ్చిపోతున్నారు. పట్టపగలే కొట్టుకుంటున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని వెంకటేశ్వర నగర్ లో నడి రోడ్డు పై గ్యాంగ్ వార్ జరిగింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో స్థానిక బస్తీవాసులు భయపడి పరుగులు తీశారు. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఇరువర్గాలు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిటి కేస్ నమోదు చేసి వదిలేశారు. ఈ దాడి లో అంబర్ పెట్ కు చెందిన ముగ్గురు రౌడి షీట్స్ ఉన్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.