కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయిం తల్లి తాహెరాబేగంగాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున అమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలతో పాటు పలు నేరాలకు పాల్పడిన తాహెరాబేగంపై 12 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.