Asianet News TeluguAsianet News Telugu

గణేష్ నిమజ్జనం: అధికారులపై బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ ఫైర్

Karimnagar: గణేష్ నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. "గ‌ణ‌ష్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో పనులు పూర్తి కాలేదు. ఊరేగింపుగా వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు ఇంకా తొలగించబడలేదు. గుంత‌లు పూడ్చ‌డం, నిమ‌జ్జ‌నం కోసం వేదిక‌ల ఏర్పాటు వంటి సిమెంట్ పనులు పూర్తి కాలేద‌ని" అయ‌న పేర్కొన్నారు.
 

Ganesh immersion: BJP MP Bandi Sanjay Kumar slams officials RMA
Author
First Published Sep 27, 2023, 4:01 PM IST

BJP MP Bandi Sanjay Kumar: Karimnagar: గణేష్ నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. "గ‌ణ‌ష్ నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో పనులు పూర్తి కాలేదు. ఊరేగింపుగా వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలు ఇంకా తొలగించబడలేదు. గుంత‌లు పూడ్చ‌డం, నిమ‌జ్జ‌నం కోసం వేదిక‌ల ఏర్పాటు వంటి సిమెంట్ పనులు పూర్తి కాలేద‌ని" అయ‌న పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టికే గ‌ణేష్ నిమ‌జ్జ‌నాలు ప‌లు చోట్ల ప్రారంభం అయ్యాయి.   గురు, శుక్ర‌వారాల్లో పూర్తిస్థాయిలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నాలు జ‌ర‌గున్నాయి. అయితే, దీని కోసం ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రీంన‌గ‌ర్ లో గణేష్ నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రతి ఏటా గణేష్ విగ్రహాలను టవర్ సర్కిల్‌కు తీసుకురావద్దని అధికారులు ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఏర్పాట్లను పరిశీలించి, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాలన్నీ టవర్ సర్కిల్‌కు రావాలని ఆయన తెలిపారు. అలాగే, "ఇంకా పనులు పూర్తి కాలేదు, విద్యుత్ తీగలు ఇంకా తొలగించబడలేదు. నిమ‌జ్జ‌నం వేదిక‌ల నిర్మాణాలు స‌హా సిమెంట్ పనులు పూర్తి కాలేద‌ని" అన్నారు. నిత్యం విధిగా సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భక్తుల ఆగ్రహానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇదిలావుండ‌గా, ఈ నెల 28న గణేష్ నిమజ్జనం రోజున ఊరేగింపు సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసు ట్రై కమిషనరేట్ అధికారులు కట్టుదిట్టమైన మార్గదర్శకాలు, భద్రతా ఏర్పాట్లను రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో 74 నిమజ్జన కేంద్రాలు, 24 పోర్టబుల్ ఇమ్మర్షన్ బేబీ చెరువులు, 27 బేబీ చెరువులు ఉన్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 36 నిమజ్జన వేదికల నిర్మాణాలను పలు శాఖలు చేపట్టనున్నాయి. నిమజ్జనం రోజున భద్రత కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) సహా పోలీసు శాఖలకు చెందిన 20 వేల మందికి పైగా అధికారులను మోహరించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios