హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతుండగా.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రూ.19 లక్షల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

అరెస్ట్ అయిన వారు: 

శ్రీహరి
నరేశ్ అగర్వాల్
రవి
పాండురంగ రాజు
రవివర్మ
వెంకట రాజు
తమ్మిరాజు
మహేంద్రా
సుభాష్ నాయుడు
ప్రసాద్
వాచ్‌మెన్ శేఖర్