Asianet News TeluguAsianet News Telugu

బైక్ పై వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

కలెక్టర్ మాత్రం సామాన్యుడిలాగా.. ద్విచక్రవాహనంపై వచ్చారు. పుట్టిలో ప్రయాణించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనే కలెక్టర్ శశాంక.

gadwal collector visits small villege diwi yesterday
Author
Hyderabad, First Published Nov 5, 2018, 10:58 AM IST

సాధారణంగా కలెక్టర్లు ఏదైనా గ్రామానికి వెళ్తున్నారూ అంటే.. స్పెషల్ ప్రభుత్వ వాహనంలో, సెక్యురిటీతో, మందీ మార్భలంతో వచ్చేస్తారు. ఏదో హడావిడీ చేసి వెళ్లిపోతారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం సామాన్యుడిలాగా.. ద్విచక్రవాహనంపై వచ్చారు. పుట్టిలో ప్రయాణించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనే కలెక్టర్ శశాంక.

ఆదివారం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం గుర్రంగడ్డ గ్రామంలో ఆ జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు.  ఆ గ్రామస్థులు రోజూ పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామానికి సరైన వైద్య సదుపాయం కూడా లేదు. ఆ గ్రామంలో విధులు నిర్వర్తించడానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆసక్తి చూపేవారు కాదు.

ఒకవేళ తప్పక డ్యూటీ చేయాల్సి వస్తే.. ఎక్కువశాతం డుమ్మా కొట్టేవారట. ఎక్కడికి వెళ్లాలన్నా.. పుట్టిలో ప్రయాణించాల్సిందే. కార్మికులు ప్రతిరోజూ పుట్టిలో ప్రయాణించి పనులకు వేరే గ్రామానికి వెళ్తుంటారు. ఇలా వారి ప్రతి ఒక్క సమస్యను కలెక్టర్ స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios