టీడీపీలో ఉన్న సమయంలో మంత్రి పదవి ఇవ్వకపోతే తాము మీకు అండగా నిలబడలేదా అని తెలంగాణ ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్: టీడీపీలో ఉన్న సమయంలో మంత్రి పదవి ఇవ్వకపోతే తాము మీకు అండగా నిలబడలేదా అని తెలంగాణ ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇన్నయ్య మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట ఉప ఎన్నికల్లో మావోయిస్టులు బెదిరిస్తే మేం కాదా కాపాడిందని ఆయన గుర్తు చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక దేని కోసం వచ్చిందని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి అయితే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎవరినైనా తొలగించాలన్న దానికి ఒక పద్దతి ఉంటుందన్నారు.కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇప్పటివరకు 155 మంది పై బైండోవర్ కేసులు పెట్టారన్నారు.హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమావేశంలోస్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
