నాగార్జునసాగర్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  జానారెడ్డి, నోముల నర్సింహ్మయ్యలు శుక్రవారం నాడు ఒకరినొకరు  ఆప్యాయంగా పలకరించుకొన్నారు. నర్సింహ్మయ్యను  జానారెడ్డి ఆలింగనం చేసుకొన్నారు.

నాగార్జున  సాగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహ్మయ్య బరిలో నిలిచారు.  పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న జానారెడ్డికి ఎదురుగా నోముల నర్సింహ్మయ్య వాహనంలో రావడం కన్పించింది.

జానారెడ్డిని చూసిన నర్సింహ్మయ్య తన కారును ఆపారు. అయ్యా నమస్కారం అంటూ జానారెడ్డి వద్దకు నర్సింహ్మయ్య వెళ్లారు. నర్సింహ్మయ్యను .జానారెడ్డి ఆప్యాయంగా  పిలిచి ఆలింగనం చేసుకొన్నారు. ఓటు వేశావా అంటూ జానారెడ్డి నర్సింహ్మయ్యను అడిగారు. నర్సింహ్మయ్యకు నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం.  గత ఎన్నికలకు ముందు  నర్సింహ్మయ్య సీపీఎం ను వీడి టీఆర్ఎస్ లో చేరారు.  గత ఎన్నికల్లో  జానారెడ్డి చేతిలో నర్సింహ్మయ్య ఓటమి పాలయ్యారు. మరోసారి వీరిద్దరూ కూడ తలపడుతున్నారు.

"