Asianet News TeluguAsianet News Telugu

ఫలవంతంగా చర్చలు: ప్రియాంక గాంధీతో భేటీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విషయాలపై ప్రియాంక గాంధీతో జరిగిన సమావేశంలో చర్చించినట్టుగా  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

Fruitful Discussions with Priyanka Gandhi: komatireddy Venkat Reddy
Author
Hyderabad, First Published Aug 24, 2022, 7:32 PM IST

న్యూఢిల్లీ: రాష్ట్రంతో పాటు దేశంలో పార్టీని బలోపేతం చేసే విషయమై ప్రియాంక గాంధీతో జరిగిన సమావేశంలో చర్చించినట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బుధవారం నాడు రాత్రి ప్రియాంకగాంధీతో సమావేశమైన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశంలో అనేక విషయాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో రాజకీయపరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

 పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. సుమారు 40 నిమిషాలపాటు పార్టీకి చెందిన అంశాలపై చర్చించామన్నారు.  ప్రియాంక గాంధీపై చర్చించిన పార్టీ అంతర్గత విషయాలను తాను మీడియాకు చెప్పబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పుడైనా తనతో చెప్పాలని ప్రియాంక గాంధీ తనకు సూచించారనన్నారు. తనకు కూడా ప్రియాంక గాంధ కొన్ని సలహాలు, సూచనలు చేశారని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. తనను నిత్యం అవమానిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్దితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ విషయమై సోనియాగాంధీకి లేఖ రాశారు.. దీంతో ప్రియాంక గాంధీ నుండి ఆహ్వానం రావడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఆమెతో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడ  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో చర్చించాలని కూడా పార్టీ నేతలకు ప్రియాంక గాంధీ సూచించింది.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించాలని పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా  ప్రియాంక గాంధీ సూచించిన విషయం తెలిసిందే. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios