Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఉచిత క్యాబ్ సేవలు.. ఎవరికోసమంటే..

ఈ సర్వీసు లాక్ డౌన్ సమయంలో 24గంటలపాటు అందుబాటులో ఉండనుందని వారు చెప్పారు. అంతేకాకుండా ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉంటుందని.. ఎవరూ రూపాయి కూడా చెల్లించనవసరం లేదని చెప్పారు.
 
freebalite cabs for Emergency services in Hyderabad
Author
Hyderabad, First Published Apr 15, 2020, 1:15 PM IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలకు అత్యవసర సేవలు అందడం లేదు. కనీసం ఆరోగ్యం బాగోకపోయినా ఆస్పత్రికి వెళ్లేందుకు వాహనం కూడా దొరకడం లేదు. ఈ క్రమంలో ఉచితంగా క్యాబ్ సేవలను అందజేస్తున్నారు.

అత్యవసర సేవల కోసం అలైట్ క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్- హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సర్వీసులను మంగళవారం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు.

ఈ సర్వీసు లాక్ డౌన్ సమయంలో 24గంటలపాటు అందుబాటులో ఉండనుందని వారు చెప్పారు. అంతేకాకుండా ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉంటుందని.. ఎవరూ రూపాయి కూడా చెల్లించనవసరం లేదని చెప్పారు.

సీనియర్‌ సిటిజన్లు, సింగిల్‌ మదర్స్‌, దివ్యాంగులు ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చు. నిత్యావసర వస్తువులు, ఆస్పత్రులు, మెడిసిన్‌, బ్యాంకు, పోస్టాఫీసులకు వెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఈ సంక్షోభ సమయంలో ఆహారం, మందులు సరఫరా చేసి సేవలందించాలనుకునే స్వచ్ఛంద కార్యకర్తలూ వినియోగించుకోవచ్చు. రెగ్యులర్‌గా ఆస్పత్రులకు వెళ్లేవారు, డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ ఉండి.. అక్కడికి అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు, గుండె సంబంధిత, చిన్నారుల టీకాలకు సంబంధించిన సేవల కోసం ఈ క్యాబ్ లను వినియోగించుకోవచ్చు.

కాగా..కరోనా  లక్షణాలు ఉన్నవారు.. కరోనా సోకిన వారికి మాత్రం వీటిలో అనుమతి లేకపోవడం గమనార్హం.
Follow Us:
Download App:
  • android
  • ios