హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో ఉచిత తాగునీరు అందిస్తామని వెల్లడించింది.

జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితమని ప్రకటించింది. రెండ్రోజుల్లో ఉచిత తాగునీరు విధివిధానాల ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంది.  

ఇందుకు సంబంధించి సీఎస్, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల తాగునీటిలో 20 వేల లీటర్లు ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.

జనవరిలో వచ్చే డిసెంబర్ బిల్లులో రాయితీ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఉచిత తాగునీరు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.