ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోటో వాట్సాప్ డీపీతో మోసం: తెలంగాణ హైకోర్టు ఉద్యోగికి రూ. 2 లక్షల టోకరా

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని తెలంగాణ హైకోర్టులో పనిచేసే శ్రీమన్నారాయణ అనే హైకోర్టు ఉద్యోగి నుండి  సైబర్ నేరగాళ్లు రూ. లక్షలు కొట్టేశారు. ఈ విషయమై శ్రీమన్నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fraudster uses Delhi high Court Chief Justice Satish Chandra Sharma photo on WhatsApp to ask for money

హైదరాబాద్: Delhi  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  Satish Chandra Sharma  ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని Telangana High Court లో పనిచేసే శ్రీమన్నారాయణ అనే హైకోర్టు ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. రూ. 2 లక్షల విలువైన గిఫ్ట్ కార్డులను శ్రీమన్నారాయణ సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా పంపారు.

 చివరకు తాను మోసపోయాయని గుర్తించిన శ్రీమన్నారాయణ హైద్రాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సతీష్ చంద్రశర్మ పనిచేశారు. ఇటీవల కాలంలోనే ఆయన తెలంగాణ హైకోర్టు నుండి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు.

 తెలంగాణ హైకోర్టులో పనిచేసే శ్రీమన్నారాయణ అనే ఉద్యోగికి సఃతీష్ చంద్ర శర్మ వాట్సాప్ డీపీని పెట్టుకొని సైబర్ నేరగాళ్లు శ్రీమన్నారాయణతో చాటింగ్ చేశారు.  తన కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. తాను ముఖ్యమైన సమావేశఁలో ఉన్నానని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పేరుతో చాటింగ్ చేశారు సైబర్ నేరగాళ్లు.  తనకు అత్యవసరంగా రూ. 2 లక్షలు పంపాలని  కోరాడు.

 అంతేకాదు ఓ లింక్ ను కూడా పంపారు. ఈ లింక్ ఆధారంగా శ్రీమన్నారాయణ  రెండు లక్షలను పంపాడు. చివరకు ఈ విషయమై శ్రీమన్నారాయణ ఆరా తీస్తే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ డబ్బులు అడగలేదని శ్రీమన్నారాయణ గుర్తించారు. 

తనను సైబర్ నేరగాళ్లు మోసం చేశారని గుర్తించిన  శ్రీమన్నారాయణ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా ఇదే తరహాలో ప్రముఖుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios