తెలంగాణ బీజేపీ నేత (bjp) , జితేందర్‌రెడ్డి (jithender reddy) నివాసంలో కిడ్నాప్ ఘటన (kidnap) కలకలం రేపింది. ఢిల్లీ సౌత్‌ అవెన్యూలోని ఇంట్లో నుంచి కారు డ్రైవర్‌తో పాటు మరో మగ్గురు అతిథులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు నగర పోలీసులకు ఫిర్యాదు అందింది.

తెలంగాణ బీజేపీ నేత (bjp) , జితేందర్‌రెడ్డి (jithender reddy) నివాసంలో కిడ్నాప్ ఘటన (kidnap) కలకలం రేపింది. ఢిల్లీ సౌత్‌ అవెన్యూలోని ఇంట్లో నుంచి కారు డ్రైవర్‌తో పాటు మరో మగ్గురు అతిథులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సౌత్‌ అవెన్యూలోని 105 నివాసంలో జితేందర్‌రెడ్డి ఉంటారు. గత 3 రోజులుగా ఆయన నివాసంలో కొందరు గెస్ట్‌లు ఉంటున్నారు. ఈక్రమంలో జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ తో పాటు ముగ్గురు గెస్ట్‌లను బలవంతంగా తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో నమోదైంది. ఈమేరకు ఢిల్లీ సౌత్‌ అవెన్యూ పీఎస్‌లో జితేందర్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు. 

రాష్ట్రపతి సహా ఎంతోమంది వీఐపలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తూ వుంటారు. కట్టుదిట్టమైన భద్రత వుండే ఈ మార్గంలో ఓ మాజీ ఎంపీ ఇంట్లో కిడ్నాప్ ఘటన జరగడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Scroll to load tweet…