సంగారెడ్డి జిల్లాలోని కన్సాన్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు.

సంగారెడ్డి జిల్లాలోని కన్సాన్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. వివరాలు.. ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి శివారులో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.