అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల గండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.