Asianet News TeluguAsianet News Telugu

ఆ రెండు సినిమాలు చూసి సికింద్రాబాద్ జ్యుయలరీ దుకాణంలో దోపీడీ: సీవీ ఆనంద్


సికింద్రాబాద్  సిద్ది వినాయక  జ్యుయలరీ  దుకాణంలో  దోపీడీకి పాల్పడిన  పది మందిలో  నలుగురిని  అరెస్ట్  చేశారు పోలీసులు. 
 

Four  Held  For  Siddi Vinayaka jewellery  Shop  Robbery Case   :Hyderabad  CP  CV  Anand  lns
Author
First Published May 30, 2023, 4:08 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని  సిద్ది వినాయక  జ్యుయలరీ దుకాణంలో   ఐటీ   అధికారులుగా  చెప్పి   రెండు కిలోల బంగారం  దోచుకున్న  నలుగురిని  అరెస్ట్  చేసినట్టుగా  హైద్రాబాద్ సీపీ   సీవీ ఆనంద్  చెప్పారు. 

మంగళవారంనాడు  హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్ తన  కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  సిద్ది వినాయక  జ్యుయలరీ  షాపు లో  పనిచేసే   అక్తర్  అనే వ్యక్తి  ఈ దుకాణంలో  దోపీడీకి  ప్లాన్  చేసినట్టుగా  సీపీ  వివరించారు.  మహారాష్ట్రలోని  సాంగ్లీ జిల్లాలోని  ఖానాపూర్ కు  చెందిన  తన  స్నేహితులకు  ఈ దోపీడీ గురించి వివరించారన్నారు.

ఐటీ అధికారులుగా  నటిస్తూ  బంగారం దుకాణంలో  దోపీడీ  చేసేందుకు  ప్లాన్  చేసినట్టుగా  సీవీ వివరించారు.  ఈ దోపీడీ సమయంలో  నిందితులు  రెండు సినిమాలు  చూశారని  సీపీ  తెలిపారు  అక్షయ్  కుమార్ నటించిన అక్షయ్ కుమార్ నటించిన  స్పెషల్ 26, సూర్య నటించిన  గ్యాంగ్  సినిమా  దోపీడీకి   ప్లాన్  చేసిందని  సీవీ ఆనంద్ వివరించారు. 

మొత్తం  పది మంది  దోపీడీకి పాల్పడినట్టుగా  సీపీ తెలిపారు.  అయితే   మహారాష్ట్ర ఖానాపూర్ లో నలుగురిని  అరెస్ట్ చేసినట్టుగా  సీపీ తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు  చర్యలు చేపట్టారు.  ఈ ఆరుగురు నిందితులు  గోవాలో  తలదాచుకున్నారని  సీపీ  చెప్పారు.  ఈ ఆరుగురి  కోసం  గాలింపు  చర్యలు చేపట్టామన్నారు.  నిందితుల  నుండి  ఇంకా  కొంత  బంగారం రికవరీ  చేయాల్సి ఉందని  సీపీ తెలిపారు. 

also read:ఐటీ అధికారులంటూ సికింద్రాబాద్ జ్యుయలరీ షాప్ లో దోపీడీ : థానేలో నలుగురు అరెస్ట్

ఖానాపూర్ లో  నలుగురిని  అరెస్ట్  చేసిన విషయం తెలుసుకున్న  మిగిలిన  ఆరుగురు దుండగులు  తప్పించుకు తిరుగుతున్నారని  సీపీ చెప్పారు. నకిలీ  ఐటీ  అధికారుల పేరుతో  జ్యయలరీ దుకాణంలో దోపీడీ  గురించి   ఫిర్యాదు  రాగానే  తమ టీమ్ లు రంగంలోకి దిగాయని  సీపీ  చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios