మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

గుడిగండ్ల వద్ద  కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.గుడిగండ్ల వద్ద కారు బోల్తా పడింది. వేగం అదుపు కాకపోవడంతో  కారు బోల్తాపడింది. కారులోని నలుగురు మరణించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

హైద్రాబాద్ లోని బండ్లగూడకు చెందిన ఓ కుటుంబం కర్ణాటకలోని రాయిచూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

రాయిచూర్ లోని ఓ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గుడిగండ్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు వద్ద  కారు అదుపుతప్పి బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.